22-07-2025 12:00:00 AM
రాజాపూర్ జూలై 21: మండల కేంద్రంలోని శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి ఆలయంపై వర్షపు నీరు నిలుస్తోందని, ఆలయంపై వర్షపు నీరు నిలవకుండా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాల ని గ్రామ ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ఆలయానికి సంబంధించిన బోరు ను సైతం ఇతరులు వాడుకుంటున్నారని, ఆలయ బోరు నీరును వేరే వ్యక్తులకు ఇవ్వకుండా చూడాలని గ్రామ యువకులు ఆలయ నిర్వహకులకు విజ్ఞప్తిచేశారు.