calender_icon.png 1 August, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతులెత్తి మొక్కుతా!

31-07-2025 12:50:15 AM

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్ జూలై 30 గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగ్గ సరైన మౌలిక వసతులు ,సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సంఘటన బాధాకరమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ,అధికారులకు చేతులు ఎత్తి మొక్కుతా గురుకుల పాఠశాలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందు కు చొరవ తీసుకోవాలని అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే విజయుడు బుధవారం సందర్శించారు. ఎమ్మెల్యే విద్యా ర్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వంట గది, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు.