31-07-2025 12:52:13 AM
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి
వనపర్తి, జూలై 30 ( విజయక్రాంతి ) : పది సంవత్సరాల నుండి నిరుపేదలు కళ్లలో వత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న తెల్ల రేషన్ కార్డుల కల రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఉండి దరఖాస్తులు చేసుకున్న అనేక మంది పేద ప్రజలకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు జారీ చేయలేదని దాని వల్ల వారు ఎంతో నష్టపోయారన్నా రు. ఈ ప్రభుత్వం అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేస్తుందని తెలియజేశారు.తెల్ల రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా కార్డులు ఇవ్వడంతో పాటు వారి అభిప్రాయాలను అడిగారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చాంద్ పాషా, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.