10-08-2025 11:52:15 PM
కమలాపూర్/హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా రావుల వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఉప్పల రాజ్ కుమార్, కోశాధికారిగా ఉప్పల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రజక యూత్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. వీరి కాలపరమిది మూడేళ్లు కొనసాగనుంది. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రజక సంఘం నాయకులకు, యూత్ సభ్యులకు అసోసియేషన్ నూతన కమిటీ ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.