22-09-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) జిల్లాలో దసరా నవరాత్రులు బతుక మ్మ పండుగ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రా రంభమయ్యాయి. ఆలయ ప్రాంగణాలు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబడి విరాజిల్లుతున్నాయి.భక్తులు, ముఖ్యంగా బ తుకమ్మ ఆడే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. శ్రీ దేవి నవరాత్రోత్సవాలు 22.09.2025 సోమవారం నుండి 02.10.2025 గురువారం వరకు 11 రోజు లు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఆల య ఆర్జిత సేవలైన నిత్య కళ్యాణములు, మ హా లింగార్చన, శ్రీ సత్యనారాయణ వ్రతములు, ఆకులపూజలు, పల్లకి సేవలు నిలిపి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభిషేకములు, అన్నపూజలు మాత్రం సమయా నుకూలంగా నిర్వహించబడునని. 01.10. 2025 (మహర్నవమి): తెప్పోత్సవం,
02.10.2025 (విజయ దశమి): అంబారి సేవ, శమీ పూజలు ఉన్నందున, ఈ రెండు రోజుల్లో పెద్ద సేవ టికెట్లు కూడా నిలిపివేయబడతాయని, భక్తులు గమనించగలరని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.నవరాత్రుల సందర్భంగా రోజూ వారీగా అమ్మవారి అలంకారముల వివరములు
22-09-2025: శైలపుత్రీ దేవి అలంకారం
23-09-2025: బ్రహ్మచారిణి అలంకారం
24-09-2025: చంద్రఘంటా దేవి అలంకారం
25-09-2025: కూష్మాండ దేవి అలంకారం
26-09-2025: కూష్మాండ దేవి అలంకారం
27-09-2025: స్కందమాత అలంకారం
28-09-2025: కాత్యాయినీ దేవి అలంకారం
29-09-2025: కాళరాత్రి దేవి అలంకారం
30-09-2025: మహాగౌరీ దేవి అలంకారం దుర్గాష్టమి 01-10-2025: సిద్ధిదాత్రి దేవి అలంకారం మహర్నవమి
02-10-2025: శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం పాలవెల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము విజయదశమినాడు