18-08-2025 01:26:30 AM
నిధి అగర్వాల్ చాలా కాలం తర్వాత ఇటీవలే ‘హరిహర వీరమల్లు’తో కలిసి ప్రేక్షకుల ముందుకొ చ్చింది. ఈ సినిమా మిశ్రమ ఫలితాలు దక్కించుకున్నప్పటికీ తమ అభిమాన హీరోయిన్ పవన్‌కల్యాణ్ సరసన నటించిందన్న ఆనం దాన్ని నిధి ఫ్యాన్స్‌లో వ్యక్తమైంది. ఇక నిధి నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రాజాసాబ్’. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటిస్తోంది నిధి.
ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ మరో కొత్త ప్రాజెక్టులో భాగం కానుంది. నిఖిల్ కార్తీక్ రచనాదర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో నిధి అగర్వాల్ లేడీ లీడ్ రోల్‌లో నటించనుంది. దీన్ని జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై పుప్పాల అప్పలరాజు నిర్మించనున్నారు. దసరాకు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీమ్ సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది.
ఇందుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కళ్లు మాత్రమే కనిపిస్తూ, ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబర్చేలా ఉంది. తమ కొత్త ప్రాజెక్టులో లీడింగ్ లేడీ నిధి అగర్వాల్ అని తెలియజేస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘రాజాసాబ్’ నుంచి బర్త్‌డే పోస్టర్
నిధి అగర్వాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ‘రాజాసాబ్’ టీమ్ ఆదివారం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో నిధి.. దేవుడిన్ని ప్రార్థిస్తూ ఆకట్టుకుంటోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మారుతి దర్శకుడు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళ, కన్న డ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తం గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.