18-08-2025 01:24:58 AM
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెతో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గందరగోళలం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సమస్యకు సోమవారంతో తెర పడనున్నట్టు తెలుస్తోంది. అగ్ర నటుడు చిరంజీవి సోమవారం ఫెడరేషన్ నాయకులతో మాట్లాడనునారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న భేటీతో సమ్మెకు తెర పడుతుందన్న ఆశాభావాన్ని నిర్మాతలు, ఛాం బర్ పెద్దలు ఆశాభావంతో ఉన్నారు.
పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో నిర్మాత సీ కల్యాణ్ ఆదివారం సమావేశమయ్యారు. నిర్మాతల మండలి తరఫున ఆయన మెగాస్టార్‌ను భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నేనెప్పుడూ ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమాకు నిర్మాతే కీలకం. నా వంతుగా కార్మికులతోనూ మాట్లాడతా’నని చిరంజీవి అన్నా రని సీ కల్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సీ కల్యాణ్ తన అభి ప్రాయాలను వెల్లడించారు. “లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం సినిమాలకు పని చేయలేం. ఓ కుటుంబంలా పనిచేయడమనేది తెలుగు చిత్ర పరిశ్రమలో అలవా టైంది. పొరుగు పరిశ్రమలతో సంబంధం లేకుండా వాళ్ల కన్నా ఎంతో ఎక్కువ మొత్తంలో కార్మికులకు ఇస్తున్నాం. మేం చెల్లిస్తున్నది కార్మికశాఖ పేర్కొన్న వేతనాల కన్నా ఎక్కువగానే ఉంది.
ఆ శాఖ నిబంధనల ప్రకారం భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తు న్నాం. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య ఐక్యత ఎప్పుడూ ఉండదు. ఏడాదిలో సుమారు 300 సినిమాలు రూపొందితే.. వాటిలో పెద్దవి 60 సినిమాలే ఉంటాయి. గతంలో అగ్రిమెంట్ చేసిన రెండు ప్రతిపాదనలు ఇప్పటికీ అమలు కావటంలేదు. ఇందుకు కారణం కచ్చితంగా నిర్మాతలే.
ఎందుకంటే నిర్మాతల బలహీనత కార్మికులకు తెలుసు, కార్మికుల ఆకలి నిర్మాతలకు తెలుసు. ఏదేమైనా నిర్మాతల పెట్టిన నాలుగు ప్రతిపా దనలకు కార్మికులు ఒప్పుకోవాల్సిందే. ఉన్నట్టుండీ అనేసరికి వాళ్లు కూడా నిరాకరిస్తున్నారు. దీన్ని వాళ్లూ అర్థం చేసుకుం టారు. అలా జరగని పక్షంలో పెద్దలు జోక్యం చేసుకొని సమస్య పరిష్కారాని పూనుకుంటారు. అదే జరగాలి. గరిష్టంగా రెండు రోజుల్లో అంతా సద్దుమణిగిపోతుంది.
షూటింగులు ప్రారంభమవు తాయి” అన్నారు సీ కల్యాణ్. కార్మికుల వేతనాల పెంపు విషయమై కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య చర్చలు జరుగు తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నిర్మాతలతో మాట్లాడిన అనంతరం ప్రొడ్యూసర్ సీ కల్యాణ్ తాజాగా చిరంజీవితో మరోమారు సమావేశమైన దరిమిలా ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశముందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.