calender_icon.png 14 May, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికి రాజీవ్ యువ వికాసం రుణాలు మంజూరు చేయాలి

14-05-2025 05:02:36 PM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొనుగోటి రంగా..

మునగాల: రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) జిల్లా అధ్యక్షులు పొనుగోటి రంగా(Ponugoti Ranga) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణాల మంజూరు కోసం విధించిన నిబంధనలను వెంటనే విరమించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి విజ్ఞప్తి చేశారు. అనేక షరతులు విధించి రుణ లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికి అధికారులు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని లేని పక్షంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో దరఖాస్తు దారులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

రాజీవ్ యువ వికాసం రుణాల మంజూరు కోసం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) ను ప్రమాణికంగా చూడొద్దని అన్నారు.రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాల మంజూరు విషయంలో సిబిల్ ఉంటేనే రుణాలు వస్తాయని, లేకపోతే రుణాలు రావని రాష్ట్రంలోని జిల్లాల అధికారులు అంటున్నారని, దీంతో యువత తీవ్ర అందోళనకు గురవుతోందన్నారు. ఇటు ఉద్యోగాలు రాక, అటు స్వయం ఉపాధి కోసం రుణాలు అందక యువశక్తి నిర్వీర్యమయ్యే అవకాశం ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సిబిల్ చాలా తక్కువగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు న్యాయం జరుగుతుందన్న ఆశతో యువత ఉండేదని, ఇప్పుడు ఇలాంటి కఠినతరమైన నిబంధనలు పెట్టి యువత భవిష్యత్తును అందకారంలోకి నెట్టి వేస్తోందని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వంయం ఉపాధి కల్పించేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు సబ్సిడీ కింద రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీని బడ్జెట్ ను రూ.6వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. రుణాల మంజూరులో స్థానిక ఎమ్మెల్యే, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ లో బ్యాంకుల జోక్యం లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.