16-08-2025 12:00:00 AM
అర్మూర్, ఆగస్టు 15 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు రెండవసారి ఉత్తమ కమిషనర్ గా ఎన్నికై అవార్డు అందుకున్నారు. 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఉత్తమ అధికారిగా మరోసారి ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి, ఇతర అధికారులకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.