19-07-2025 01:59:13 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): రాఖీ పండగ, శ్రావణమా సాన్ని పురస్కరించుకొని మిస్ వైశాలి అగర్వాల్, కాళీ బై వైశాలి, శివసా ఫైన్ జ్యువెల్లరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కలెక్షన్లను జూబ్లీహిల్స్‌లోని వైశాలి అగర్వాల్ జ్యువెల్లరీలో శుక్ర వారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకురాలు, రచయిత నందినిరెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ మార్కెట ర్ భక్తి రెడ్డి, వైశాలి అగర్వాల్ ఫండర్, కాళీ బై వైశాలి అగర్వాల్ క్రియేటివ్ హెడ్ వైశాలి అగర్వాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైశాలి అగర్వాల్ తన మిథులి కలక్షన్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.
శంకుతల కాలాతీత కథనుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్‌ను రూపొందించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త కలెక్షన్‌లో బెనారస్, అజ్రాఖ్ హస్తకళలలో ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్లు ఉన్నా యి. ఇందులో భారతీయ కళాత్మకతను, ఆధునిక డిజైన్‌లతో మిళితం చేసినట్టు పేర్కొన్నారు. వచ్చే శ్రావణమాసం, రాఖీ పండగ సందర్భాల్లో ఈ కొత్త డిజైన్‌లు మగువలకు చక్కగా సరిపోతాయని వివరించారు. కాళీ బై వైశాలి ఆధ్వర్యంలో లేస్ అండ్ లూమ్‌తో కూడిన అధునతన కలెక్షన్‌ను సైతం ఆవిష్కరించారు. ఈ కొత్త కలెక్షన్ బ్లౌజ్‌లు విక్టోరియన్ డిజైన్ల నుంచి ప్రేరణ పొంది రూపొందించారు.