calender_icon.png 17 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక సింగరేణి కార్పొరేషన్‌గా రామగుండం

17-01-2026 01:10:37 AM

గోదావరిఖనిలో అంబేద్కర్ నూతన పార్కు 

శంకుస్థాపనలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ 

గోదావరిఖని జనవరి 16 (విజయ క్రాంతి): ఇక సింగరేణి కార్పోరేషన్ గా రామగుండం కు నామకరణ చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. గోదావరిఖనిలోని రామగుండం కార్పొరేషన్ ఎదురుగా సింగరేణి సహకారంతో నిర్మిస్తున్న అంబేద్కర్ నూతన పార్కు కు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంగా గుర్తింపు పొందిన గోదావరిఖని రామగుండం కార్పొరేషన్ ను సింగరేణి కార్మికుని పేరుతో సింగరేణి కార్పోరేషన్ గా పేరు మారుస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.

ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి భూగర్భంలోకి వెళ్లి బొగ్గును తీసుకువచ్చి వెలుతురునిస్తున్న కార్మికుడికి గుర్తింపుగా ఈ నామకరణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పేరుకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే మీడియా ముందుటకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిఎం లలిత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.