19-01-2026 12:00:00 AM
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సంబురాల్లో ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): దేశంలో ఏ ఎన్నికలు వచ్చిన బీజేపీ పార్టీ విజయ డంకా మోగిస్తుందని, రానున్న భవిష్యత్తు అంతా భారతీయ జనతా పార్టీ దే నని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహారాష్ట్ర లోని ముంబై తో పాటు ఇతర మున్సిపాలిటీలో బీజేపీ దాని అనుబంధ పార్టీలు విజయం సాధించడంతో ఆదిలాబాద్‌లో బీజేపీ పార్టీ ఆధ్వ ర్యంలో విజయోత్సవ సంబరాలు చేపట్టారు.
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు చేపట్టిన సంబరాల్లో ఆ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుకుని విజయోత్సవ సంబరాలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.... పార్లమెం ట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర మున్సిపాలిటీలో బీజేపీ పార్టీతో పాటు దాని అనుబంధ పార్టీలు 85 శాతానికి పైగా గెలుపొందడం చూస్తే మరోమారు బీజేపీ కి ప్రజలపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.