calender_icon.png 14 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘యునెస్కో’తో రామప్పకు మరింత శోభ

14-11-2025 12:04:50 AM

ప్రజా సంక్షేమం, అభివృద్ధియే నా ధ్యేయం: -మంత్రి సీతక్క

వెంకటాపూర్(రామప్ప), నవంబర్13, (విజయక్రాంతి):ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.

రామప్ప సరస్సులో ద్వీపం, శివుడి విగ్రహం ఏర్పాటువెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప సరస్సులో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వీప అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రామప్ప సరస్సు మధ్యలోని 20 ఎకరాల్లో ఏడు ఎకరాలపై టూరిజం శాఖ శివుడి విగ్రహం, యోగా, పూజలు, శివతాండవ నృత్యాలకు అనువుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. సరస్సు నీటి మట్టం ఎంత పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు.రామప్పకు యునెస్కో గుర్తింపు గర్వకారణంరామప్ప దేవాలయం ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన విశిష్ట కట్టడం అని, యునెస్కో గుర్తింపు రావడం తెలంగాణ గర్వకారణమని అన్నారు.

ఆలయ సమీపంలో ఆడిటోరియం నిర్మాణం పూర్తి కాగా, పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.హంపి థియేటర్, యంగ్ ఇండియా పాఠశాల అభివృద్ధిఇంచర్ల గ్రామ సమీపంలో రూ.35 కోట్లతో హంపి థియేటర్ ఏర్పాటు చేసి హస్తకళల ప్రోత్సాహానికి అవకాశం కల్పిస్తున్నామని, రూ.150 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

విలేజ్ పార్క్, నూనె తయారీ కంపెనీ కూడా అదే ప్రాంతంలో ఏర్పాటవుతుందని చెప్పారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి నా రెండు కండ్ల లాంటివిగత దశాబ్దంలో ములుగు ఈ స్థాయిలో అభివృద్ధి చూడలేదని, విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని అన్నారు. కాకతీయుల సంస్కృతికి, సమ్మక్కసారక్కల పున్యభూమికి తగిన స్థాయిలో అభివృద్ధి చేసి భావితరాలకు అందించడమే మా లక్ష్యం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.