14-11-2025 12:06:20 AM
తొలి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం
మహబూబాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): నిలువ నీడలేని నిరుపేదలకు సొంతింటి కల సాకారమవుతోంది. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్మిం చిన తొలి ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం గురువారం నిర్వహించారు. మహ బూబాబాద్ మండలం నడివాడ గ్రామ శివారు రంగసాయిపేటలో పన్నాల ఉపేంద్ర బిక్షమయ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆధ్వర్యంలో గృహప్రవేశం చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన గృహప్రవేశం నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నిలువ నీడ లేని పేదలకు గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు క ట్టుబడి ఇందిరమ్మ పథకంలో నిరుపేదలకు 5 లక్షల రూపాయల వ్యయంతో పక్కా గృహాన్ని కట్టించి ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభు త్వం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. దశలవారీగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నిలువ నీడలేని పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
మొదటి విడత 3,500 ఇందిరమ్మ ఇండ్లకు తోడు అదనంగా 1000 మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సురే ష్ నాయక్, మిట్ట కంటి రాంరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.