calender_icon.png 24 January, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప అద్భుతమైన కట్టడం

24-01-2026 12:33:47 AM

నారాయణపేట అడిషనల్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తొర్రుర్ జడ్జి దీరజ్ కుమార్

వెంకటాపూర్, జనవరి23,(విజయక్రాంతి):మండలంలోని ప్రపంచ వారసత్వ హోదా పొం దిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి (రామప్ప) దేవాలయాన్ని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ఐఏఎస్ మరియు తొర్రుర్ జడ్జి దీరజ్ కుమార్ లు వేర్వేరుగా సం దర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం దేవాలయ శిల్పకళ, కాకతీయుల నాటి నిర్మాణ వైభవం, చారిత్రక ప్రాముఖ్యతపై ఆలయ అర్చకులు మరియు టూరిజం గైడ్ నుండి వివరాలు తెలుసుకున్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభి ప్రాయపడ్డారు. అలాగే దేవాలయం పరిసర ప్రాంతాల అభివృద్ధి, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సా రించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వారి వెంట అధికారులు, టూరిజం పోలీసులు పాల్గొన్నారు.

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్తులు

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని అమెరికా దేశానికి చెందిన పర్యాటకులు నిక్ బెండర్స్, టెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం దేవాలయ విశిష్టత, కాకతీయుల శిల్పకళా నైపుణ్యం, ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు, చరిత్రాత్మక ప్రాధాన్యత గురించి టూరిజం గైడ్ విజయ్ వివరించారు.

ఆలయంలోని శిల్ప కళ, స్తంభాలపై చెక్కిన సున్నితమైన శిల్పాలు, ఆలయ నిర్మాణ శైలి తమను ఎంతో ఆకట్టుకున్నాయని అమెరికా పర్యాటకులు తెలిపారు. ప్రపంచ స్థాయి వారసత్వ సంపదగా రామప్ప ఆలయానికి లభించిన గుర్తింపు భారతదేశానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. వారి వెంట స్టేట్ గైడ్ శశి మనోహర్ ఉన్నారు.