calender_icon.png 24 January, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తించారు

24-01-2026 12:34:49 AM

దాడిని ఖండించిన ఎమ్మెల్యే పల్లా

జనగామ, జనవరి 23 (విజయక్రాంతి): జనగామ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం మాట్లాడారు. ‘జనగామ పట్టణంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఆహ్వానం వచ్చింది. మా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్‌తో స్వాగతం పలికాం. కానీ అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే కొబ్బరి కాయ కొట్టే సమయంలో గందరగోళం సృష్టించారు. కొందరు మద్యం మత్తులో వచ్చి, ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, కార్యక్రమాన్ని భంగపెట్టే ప్రయత్నం చేశారు.

వెజ్--, నాన్‌వెజ్ మార్కెట్ పనులు నాలుగేళ్ల క్రితమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. రెండేళ్లుగా పనులు నిలిచిపోయినా నేను ఆరు నెలలుగా వెంటపడి పని చేయిస్తే పని పూర్తి అయింది. బతుకమ్మ కుంట అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మున్సిపాలిటీలో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ నిధుల్లో నుంచి దాదాపు రూ.3 కోట్లు వెచ్చించి బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయించాం.

అయినా కొన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తూ నా మీద దాడికి ప్రయత్నించారు. జనగామకు చెందిన వారు కాదు. జనగామ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో జరిగిన ఈ గుండాగిరిని ఖండిస్తున్నాం. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.