03-07-2025 12:00:00 AM
అనురాగ్ వర్సిటీలో సహాయ అధ్యాపకుడిగా విధులు
వరంగల్, జూలై 2, (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన అప్పని రామ్‌గోపాల్ ఫార్మసీ రంగంలో చేసిన పరిశోధనలకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ఆర్.బీ.వీ.ఆర్.ఆర్ ఉమెన్స్ కాలేజ్ ప్రొఫెసర్ ఎం.సుమకాంత్ నేతృత్వంలో ‘డిజైన్ సింథసిస్, బయోలజికల్ ఎవాల్యూషన్ ఆఫ్ నావెల్ ట్రై సబ్సిట్యుటెడ్ ట్రై అజోలో క్వినజొలిన్ 5- ఓన్ అనలాగ్స్ టూ టార్గెట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్, మైకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్’ అనే అంశంపై సమర్పించిన పరిశోధ న గ్రంథానికి డాక్టరేట్ లభించింది. రామ్‌గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లా డుతూ.. పేద కుటుంబంలో పుట్టిన రామ్‌గోపాల్ ప్రభుత్వ పాఠశాల, కళాశా లల్లో చదువుకుని డాక్టరేట్ సాధించడం ఎంతో సంతోషం గా ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యునిగా విధులు నిర్వహిస్తున్న రామ్‌గోపాల్‌ను అధ్యాపకులు, విద్యార్థులు, యాజ మాన్యం అభినందించారు.