09-01-2025 05:18:21 PM
మందమర్రి (విజయక్రాంతి): విజయవాడలో ఈనెల 10 11వ తేదీల్లో నిర్వహించనున్న పని ప్రదేశాల్లో ఆరోగ్యం రక్షణ మెరుగుపరచడం వంటి అంశాలపై నిర్వహించనున్న శిక్షణ సదస్సుకు ఐఎన్టియుసి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రామ్ శెట్టి నరేందర్ ఎంపికయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించనున్న శిక్షణ సదస్సుకు తనకు అవకాశం కల్పించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి.సంజీవరెడ్డి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి.జనక్ ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.