18-08-2025 11:40:01 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఈడబ్ల్యుస్ పథకం ప్రధాని మోడీ సర్కార్ ఇచ్చిన ఒక వరమని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వలన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో అగ్రవర్ణ పేదలు 87 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో అగ్రవర్ణము లో ఉన్న పేదలంతా నరేంద్ర మోడీకి రుణపడి ఉంటారని తెలిపారు. ఆర్యవైశ్యులను అగ్రవర్ణాలు గానే చూస్తున్నారు తప్ప, వారిలో ఉన్న పేదలను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు కాదు కానీ ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం వల్ల కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారని అది తగదని తెలిపారు.