19-08-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (విజయక్రాంతి): వెంగళరావు నగర్ కార్పొరే టర్ దేదీప్య రావు సోమవారం యాదగిరి నగర్‌లో పర్యటించి పలు సమస్యలపైన పరిశీలించి పరిష్కరించారు. వర్షాలకు ఆ ప్రాం తంలోని నాలా నిండిపోవడాన్ని కార్పొరేటర్ గమనించి హైడ్రా వాళ్లని పిలిపించి నాలాలోని పూడికలు తీయించారు. అలాగే బస్తీ దవాఖాన,అంగన్‌వాడీ వద్ద నిలిచిపోయిన చెత్తను తొలగించాల్సిందిగా పారిశుధ్యం కార్మికులను ఆదేశించారు.
కాగా తమ ప్రాం తంలో కలుషితమైన నీళ్లు వస్తున్నాయని స్థానికులు కార్పొరేటర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేటర్ దేదీప్య రావు వాటర్ వర్క్స్ సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కార్పొరేటర్ వెంట డివిజన్ నాయకులు ఆంజనేయులు యాదవ్, కట్ట లక్ష్మీ, సత్యనారాయణ, పూజా రి బాలరాజు, కృష్ణ, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.