calender_icon.png 19 August, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్ప పోరాట యోధుడు పాపన్నగౌడ్

19-08-2025 12:00:00 AM

ఎమ్మెల్యే శ్రీగణేష్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (విజయక్రాంతి): బహుజనులకు కూడా రాజ్యా ధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. సోమవారం బోయిన్‌పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి శివాజీ, దక్షిణాదిలో సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని అన్నారు. పాపన్నగౌడ్ గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడని, 350 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. జమిందారులు, భూస్వాము లపై పోరాటం చేసి, సామాన్యులకు సంపద పంచిన వీరుడని, ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాటయోధుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పాపన్నగౌడ్‌ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులతోపాటు కంటోన్‌మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్,మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.