19-07-2025 01:42:03 AM
-కవ్వాల్ టైగర్ రిజర్వులో మంకీ పజిల్ బట్టర్‌ఫ్లు గుర్తింపు
మంచిర్యాల, జూలై 18 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని చెన్నూర్ అర్బన్ పార్కులో బటర్ ఫ్లై పరిశోధకుడు డాక్టర్ రమ్జాన్ విరాని, జిల్లా అటవీ అధికారి శివ్ ఆషిష్ సింగ్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో శాస్త్రవేత్త డాక్టర్ రమ్జాన్ విరాని అరుదైన మంకీ పజిల్ బటర్ ఫ్లైని గుర్తించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి మంకీ పజిల్ బటర్ ఫ్లై సంచరిస్తూ కనబడిందని, ఈ జాతి బటర్ ఫ్లైలకు హింద్ వింగ్స్‌పై ‘మంకీ ఫేస్‘ ఆకారాన్ని పోలిన గుర్తింపులతో ప్రత్యేకత ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ జాతి పశ్చిమ కనుమలు, తూర్పు గాట్స్, ఒడిశా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపించేదని, ఇప్పుడు తెలంగాణలో కనిపించడం ఈ జీవజాతి వ్యాప్తిని సూచించే ప్రాధాన్యమైన పరిణామంగా భావిస్తున్నామని తెలిపారు.