calender_icon.png 19 July, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌ఎస్ ఐఎస్‌డీసీ కాన్ఫరెన్స్‌లో సత్తా

19-07-2025 01:40:36 AM

వరల్డ్ ఛాంపియన్‌గా శ్రీ చైతన్య స్కూల్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీసీ కాన్ఫరెన్సు శ్రీచైతన్య స్కూల్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 30 దేశాలకు చెందిన మొత్తం 475 మంది విద్యార్థులు కాన్ఫరెన్సుకు హాజరయ్యారు. దీనిలో 67 మంది విద్యార్థులు భారతదేశం నుంచి హాజరయ్యారు.

అందులో 45 మంది (68శాతం) శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉన్నారని చైతన్య స్కూల్ అకడెమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. అయితే స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లో శ్రీ చైతన్య స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచింది. వీటిలో ఓరైజ్ ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజులు ప్రాజెక్టులు, మూడోస్థాయి బహుమతులు 10 ప్రాజెక్టులు మరియు 43 ప్రాజెక్టులు గౌరవ బహుమతులు సాధించాయని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో విద్యార్థులను అభినందించారు.