calender_icon.png 6 August, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెంలో అరుదైన సర్పం పట్టివేత

06-08-2025 12:00:00 AM

కొత్తగూడెం,/మణుగూరు, ఆగస్టు 5, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్ లో సోమవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కి పాము కనిపించగానే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ సభ్యుడు ముజఫర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వెళ్లి పట్టుకున్నాడు. తానూ గతంలో ఇలాంటి పామును చూడలేదనీ, సందేహించి చరవాణిలో ప్రాణదార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ కు తెలుపగా, అది విషపూరితమైన కట్లపాము జాతికి చెందిన బాండెడ్ కైట్ స్నేక్ అని, హిమోటాక్సిన్ విషం కలిగినదని,

ఈ సర్పం గుండ్రంగా కాకుండా మూడు పలకలుగా ఉండి సమాన వెడల్పు గల పసుపు, నలుపు చారలతో ఆకర్షనీయంగా ఉంటుందన్నారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఉంటుందని, రాత్రుళ్ళు మాత్రమే సంచరిస్తుందని, గతంలో ఏటూరు నాగారం రక్షకభట నిలయంలో రెండు సార్లు వచ్చినట్లు పోలీసు సిబ్బంది ఫోన్ చేశారని అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ అరుదైన సర్పం కనిపించడం ఇదే తొలిసారి అని సంతోష్ వివరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు ముజఫర్ ను స్థానికులు, ప్రాణధార ట్రస్ట్ నిర్వాహకుడు సంతోష్ అభినందించారు