06-08-2025 12:00:00 AM
కీసర, ఆగస్టు 05(విజయక్రాంతి): దమ్మాయియిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందనపల్లి అనుబంధ కాలనీలలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ వరగంటి వెంకటేష్ మంగళవారం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కుందనపల్లి గ్రామంలో సుమారు 20కి పైగా ఇంటర్నల్ పోల్స్కు పాత విద్యుత్ వైర్లను తొలగించి, వాటి స్థానంలో నూతన వైర్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, రామలింగేశ్వర కాలనీలో 15, కుందనపల్లిలో 10 కొత్త విద్యుత్ స్తంభాలను వెంటనే ఏర్పాటు చే యాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ముఖ్యంగా గౌరీ ప్రియా, అనీషా ఎంక్లేవ్ కాలనీలలో లో-వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల స్థానిక ప్రజల ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు వంటి గృహోపకరణాలు తరచుగా మరమ్మతులకు గురవుతున్నాయని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ రెండు కాలనీలకు ప్రత్యేకంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయాలని కోరారు.