calender_icon.png 12 July, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్‌లో అరుదైన శస్త్రచికిత్స

13-12-2024 01:13:13 AM

12 ఏళ్ల చిన్నారికి సర్జరీ చేసి బ్రెయిన్ ట్యూమర్ తొలగింపు

శేరిలింగంపల్లి, డిసెంబర్ 12: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారికి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. రాజేంద్రనగర్ డివిజన్ అత్తాపూర్‌లో నివాసముం టున్న అక్షర (12) కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్‌లో సంప్రదించారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ (న్యూరో అండ్ స్పైన్ సర్జన్) డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అక్షర పరిస్థితిని పూర్తిగా స్టడీ చేసి శస్త్రచికిత్స ద్వారా ట్యూమర్‌ను పూర్తిగా తొలగించి చిన్నారి ప్రాణాలు కాపాడారు.

ఆపరేషన్ అనంతరం చిన్నారి అక్షరకు హైడ్రోసెఫలస్ అనే సమస్యతో ఇబ్బంది పడింది. దీన్ని సరిచేయడానికి వైద్యులు రెండో సర్జరీ చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తున తర్వాత, అక్షర రెండు నెలల పాటు కోమలోనే ఉంది. కాగా ఓరోజు ఆకస్మాత్తుగా అక్షర మేల్కొని తన తల్లిదండ్రులతో మాట్లాడింది. దీంతో వైద్య బృందం హుటాహుటిన బ్రెయిన్‌కు సంబంధించిన స్కానింగ్ తీశారు. స్కానింగ్ రిపోర్ట్‌లో ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారనైంది.

గురువారం జరిగిన మీడియా సమావేశంలో అక్షరకు చికిత్స అందించిన డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అత్యంత సున్నిత ప్రదేశంలో చిన్న మెదడుకు ట్యూమర్ అతుక్కొని ఉందని, జాగ్రత్తగా సర్జరీ చేయడంతో చిన్నారి అక్షర ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. తమ కూతురి ప్రాణాలు కాపాడినందుకు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డికి అక్షర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నిత్య పాలపాటి పాల్గొన్నారు.