calender_icon.png 12 July, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూల్‌పేట్ మోస్ట్ వాంటెడ్ అంగూర్ బాయి అరెస్ట్

13-12-2024 01:16:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): గంజాయి అమ్మకాలతో కోట్లకు పడగలెత్తిన ధూల్‌పేట్ మోస్ట్‌వాంటెడ్ , గంజాయి డాన్ అంగూర్‌బాయిని పోలీసులు  పట్టుకున్నారు. పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న ఆమెను కార్వాన్‌లో గురువారం ఎస్‌టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన 3 కేసుల్లో, మంగళ్‌హాట్ పోలీస్టేషన్‌లో నమోదైన 4 కేసులతో పాటు ఆసీఫ్‌నగర్, గౌరా రం పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన పదుల సంఖ్యల కేసుల్లో అంగూర్‌బాయి ముద్దాయిగా ఉంది.

ఇప్పటికే 13 కేసుల్లో నిందితు రాలిగా అనేక మార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చింది. అంగూర్ బాయితో పాటు ఆమె ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 నుంచి 15 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమం లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి గురువారం కార్వాన్ ప్రాంతంలో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంగూర్‌బాయిను అరెస్ట్ చేసిన ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.