calender_icon.png 22 May, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రెయిన్‌బో’లో అరుదైన జోల్జెన్సా చికిత్స

22-05-2025 12:28:49 AM

  1. విజయవంతంగా 8వసారి పూర్తి

స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ చికిత్సలో ముందడుగు

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): భారతదేశంలో పిల్లలు, ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్‌లో ఓ చిన్నారికి విజయవంతంగా జన్యు చికిత్సను అందించింది. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ చికిత్సను ఆసుపత్రిలో ఎనిమిదోసారి నిర్వహించారు.

దీంతో పీడియాట్రిక్ ఆరోగ్య సంరక్షణలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి పర్యవేక్షణలో జరిగింది. చికిత్సలో భాగంగా ఆ చిన్నారికి జోల్జెన్స్మా అనే మం దును ఇచ్చారు. ఎస్‌ఎంఏ వ్యాధికి చికిత్స చేయడానికి దీన్ని ప్రత్యేకంగా తయారు చేశా రు.

ఈ వ్యాధికి కారణమైన ఎస్‌ఎంఎయ్1 జన్యువును ఇది సరిచేస్తుంది. ఈ చికిత్స ద్వారా, మోటార్ న్యూరాన్లు జీవించడానికి మరియు కండరాల పనితీరుకు అవసరమైన ఎస్‌ఎంఎన్ ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది.

ఒక డోస్కు సుమారు రూ.14 కోట్లు ఖర్చయ్యే జోల్జెన్స్మా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అం దుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన చికిత్సలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాగా ఎస్‌ఎంఏ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10,000 మంది పిల్లల్లో సుమారు ఒకరిని ప్రభావితం చేస్తుంది. 

ఇది తీవ్రమైన జన్యుపరమైన నరాల కండరాల సంబంధిత వ్యాధి. భారత్‌లో ఈ వ్యాధితో దాదాపు 1000 మంది పిల్లలు బాధపడుతున్నట్లు అంచనా. సకాలంలో చికి త్స అందించకపోతే, ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాధి వేగంగా ముదు రుతూ ఉండటం వల్ల శిశువులు రెండేళ్లకు మించి బతకట్లేదు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జోల్జెన్స్మా చికిత్సను అందిస్తున్న ఏకైక ఆసుపత్రి రెయిన్‌బో.

చికిత్స అందించిన తర్వాత, బాధిత పిల్లలకు నిపుణులైన వైద్య బృందం నిరంతరం పర్యవే క్షిస్తుంది. చికిత్స విజయవంతమైన చిన్నారి తండ్రి వినీత్ చౌదరి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఈ చికి త్స మా కుటుంబానికి కొత్త ఆశను ఇచ్చింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.