calender_icon.png 13 August, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ కిందపడి వ్యక్తి మృతి

13-08-2025 01:00:00 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 12:లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చ ల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 44పై చోటుచేసుకుంది. మంగళవారం మేడ్చల్ జాతీయ రహదారి 44పై వివేకానం ద విగ్రహం ఎదురుగా మేడ్చల్ నుండి ని జాంబాద్ వైపు వెళుతున్న లారీ ద్విచక్ర వా హనదారుడికి తగలడంతో అదే లారీ టైర్ల కింద పడిన కేసాని మధు (50) అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మే రకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతి చెందిన వ్యక్తి మేడ్చల్ పట్టణం లోని కేఎల్‌ఆర్ వెంచర్లో నివాసం ఉంటాడని పోలీసులు తెలిపారు.