calender_icon.png 26 January, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రతన్ టాటా మరణం తీరని లోటు

11-10-2024 12:17:02 AM

ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదిబట్లలోని టాటా కంపెనీ వద్ద గురువారం రతన్ టాటా చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రతన్ టాటా నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. టాటా ట్రస్ట్ ద్వారా అందించిన సేవలు చిరస్మరణీయమని, ఏడాదిలోపు ఆదిబట్లలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.