calender_icon.png 2 August, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్‌కార్డు పేదవాడి ఆత్మ గౌరవం

02-08-2025 02:16:01 AM

  1. బీఆర్‌ఎస్  కొత్త కార్డులు ఇవ్వలేదు 
  2. కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం
  3. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  4. కర్మన్‌ఘాట్‌లో రేషన్ కార్డుల పంపిణీ 

ఎల్బీనగర్, ఆగస్టు 1: రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి కడుపు నిండా తినడానికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్‌ఘాట్‌లో శుక్రవారం లబ్ధిదారులకు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదని, లబ్ధిదారులను తొలిగించారని విమర్శించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తుందన్నారు.

అభివృద్ధి గురించి బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గు చేటని విమర్శించారు. కేవలం ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. హైదరా బాద్ అభివృద్ధికి సుమారు రూ.10వేల కోట్లు మంజూరు చేశామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో రైలు విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని, దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప్రశ్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, డీఎస్వో వనజాత,

కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, రావుల వెంకటేశ్వర్‌రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్లు వేణుగోపాల్, జానకి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాత, మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.