calender_icon.png 31 July, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికం

31-07-2025 12:40:17 AM

-ఎమ్మెల్సీ దండే విఠల్ 

- రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కాగజ్‌నగర్, జూలై 30(విజయక్రాంతి): అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకా లు అందించడంలో రేషన్ కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ  దండే విఠ ల్ అన్నారు. గురువారం జిల్లాలోని పెంచికల్ పేట మండల కేంద్రంలో గల రైతు వేది కలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా  పాల్గొన్నారు.   

ఎమ్మెల్సీ  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడంలో రేషన్ కార్డులే ప్రామాణికంగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులైన వారి నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు సేకరించి క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన పేదవారికి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రభు త్వం రేషన్ కార్డులు అందిస్తుందని, ప్రభు త్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ పథకం వంటి సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు.

కలెక్టర్ మాట్లాడు తూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, వివాహం అయినవారు, పిల్లల పేర్లను రేషన్ కార్డులలో నమోదు కొరకు మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసిల్దార్, సిబ్బం ది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.  పెంచికల్ పేట మండలానికి 109 నూతన రేషన్ కార్డులు, 124 మంది సభ్యుల పేర్లు రేషన్ కార్డులలో నమోదు చేసి రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుందని, లబ్ధిదారులు సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  సన్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పుష్పలత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆల్బర్ట్, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం

బెజ్జుర్, జూలై 30(విజయ క్రాంతి): మం డల కేంద్రంలోని రైతు వేదికలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే,జాయింట్ కలెక్టర్ డేవిడ్,సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలసి నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. నేడు ప్రజ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు వస్తాయన్నారు. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ప్రజా ప్రభుత్వం నిత్యం పాటు పడుతోందన్నారు.మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని,రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా సమాఖ్య సంఘాల ద్వారా మహిళలకు అద్దె బస్సులను ఇచ్చామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.