23-08-2025 01:23:40 AM
- డీలర్లకు కనీస వేతనం రూ.5వేలు ఇవ్వాలి
- పెండింగ్ కమిషన్లను వెంటనే చెల్లించాలి
- రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్
- ఇందిరా పార్క్ వద్ద రేషన్ డీలర్ల ధర్నా
ముషీరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): రేషన్ షాపులను మిని సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులను పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.లక్ష్మీనారాయణ, ప్ర ధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమాన్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలం గాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డీలర్‌లకు కనీస వేతనం రూ. 5 వేలు, కమిషన్ పెంపు, డీలర్లు పంపి ణీ చేసిన ఐదు నెలల బియ్యం కమిషన్ డబ్బులను చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చే స్తూ డీలర్లు పెద్ద ఎత్తున శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుమ్ము, దూళితో తరుచూ అనారోగ్యం పాలవుతున్న రేషన్ డీలర్ల కు టుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలని అన్నారు.
బియ్యం దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలన్నారు. రేషన్ డీలర్ చనిపోతే రేషన్ డీలర్ కుటుంబానికి దహన సంస్కారాలకు రూ.30 వేలు చెల్లించాలన్నారు. గత10 సం.లుగా పేరుకుపోయిన పాత బకాయిలను చెల్లించాలన్నారు. గోదాముల నుండి భారీ ఆన్లైన్ వెయింగ్ కాంటాల (లారీని తూకం వేసే విదంగా) ద్వారా రేషన్ షాపులకు సరుకుల పంపిణీ జరిగేలా గోదాం ప్రాంగంణం లో శాశ్వత ప్రతిపదికన వే-బ్రిడ్జిలు ఏర్పాటు చేయలని డిమాండ్ చేశారు. పోర్టుబిలిటీ సిస్టం వచ్చినందున రేషన్ కార్డుల బైఫర్లెషన్ విదానాన్ని నిలుపుదల చేసి, కొత్త షాపుల ఏర్పాటు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసరమయితే గ్రామీణ ప్రాం తాల్లో 800 కార్టులు, పట్టణ ప్రాంతాల్లో 1200 కార్టులకు పైబడి ఉన్న రేషన్ షాపులను మాత్రమే బైఫర్గేషన్ చేయాలన్నారు. కరోనాతో మరణించిన రేషన్ డీలర్ల కుటుంబా లకు రూ.20 లక్షల ఎక్స్రేషియా అందించాలన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి చేపట్టే మా ఆథరైజేషన్ రెనివల్స్‌ను ఎలాంటి రెనివల్స్ లేకుం డా శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశా ధికారి కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్య సలహాదారులు ఎండీ. సాధిక్ పాషా, బల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండారి వెంకటేష్, బచ్చు రాము, మోహన్, శ్యామ్, కరుణాకర్ రెడ్డి, పుణ్యవతి, తదితరులు పాల్గొన్నారు.