calender_icon.png 16 October, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రత్నం శైలేందర్ నియమకం

15-10-2025 04:43:04 PM

హన్మకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని పరకాల పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యకులుగా నియమించినట్లు అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ శాతీయ అధ్యక్షులు డా.రాము పత్రికా ప్రకటన ద్వారా తెలియవేయడం జరిగింది. రత్నం శైలేందర్ గత 30 సంవత్సరాల నుండి వివిధ దళిత సంఘాలలో పనిచేస్తూ, దళితులను చైతన్యపరుస్తు, వారిలో సామాజిక స్పృహను కలిగిస్తు వారిని మేల్కోల్పడం జరుగుతుంది. గత కొంత కాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆల్ ఇండియా దళితయాక్షన్ కమిటీకి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నాడు.

అతను చేస్తున్న సేవా కార్యక్రమాలను చైతన్య కార్యక్రమాలను దృష్టిలోవుంచుకొని, ఇతని యొక్క సేవలు దళితులకు అవసరం అని గుర్తించి ఇతనిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినట్లు, జాతీయ అధ్యక్షలు తెలియవేశారు. ఈ సందర్భంగా రత్నం. శైలేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతపెద్ద బాధ్యతను అప్పగించిన జాతీయ అభ్యర్థులు డా. రాముకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు  అప్పుగించిన బాధ్యతను అన్ని వేళల సక్రమంగా నడిపిస్తూ, దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడుతూ, వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తు, వారిని చైతన్యం చేస్తానని అన్నారు.