calender_icon.png 16 October, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ టెక్నికల్ అఫీషియల్ గా సంతోష్ యాదవ్

15-10-2025 04:39:31 PM

బెల్లంపల్లి: బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పీఈటిగా విధులు నిర్వర్తిస్తున్న సల్పాల సంతోష్ యాదవ్ హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ 16 నుండి 18 వరకు జరగనున్న 5వ ఇండియన్ ఓపెన్ అండర్ 23 నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు టెక్నికల్ అఫీషియల్ గా నియమితులైనారు. ఈ విషయాన్ని తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఈ. మారయ్య తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు టెక్నికల్ అఫీషియల్ గా సంతోష్ నియామకం పట్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ రవి ప్రసాద్ ప్రధానోపాధ్యాయులు రాజా రమేష్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బెల్లంపల్లి పట్టణ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.