calender_icon.png 18 May, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషీగూడలో రియల్ గూండాల దౌర్జన్యం

06-05-2025 12:27:31 AM

  1. ఇంట్లో జనాలు ఉండగానే కూల్చివేతలు
  2. కోర్ట్ ఆర్డర్లు సైతం బేఖాతర్
  3. సైబరాబాద్ సీపీకి బాధితుల ఫిర్యాదు

కూకట్పల్లి, మే 5: కూకట్పల్లి మండలం ఎల్లమ్మబండ సర్వే నెంబర్ 57 భూములపై అక్రమార్కుల దండయాత్ర కొనసాగుతూనే ఉంది.   కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తూ..  పోలీసు ల సహాయంతో అర్ధరాత్రి జేసీబీలను పెట్టి జనాలు ఇండ్లలో ఉండగానే కూల్చి వేసేందు కు యత్నించారు.  సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని శంషిగూడలో భూవి వాదంలో పోలీసులు హద్దులు దాటి వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి.

30 ఏళ్లుగా ఎల్లమ్మ బండ ఫోర్త్ స్టేట్ కాలనీలో కరెంటు, వాటర్ బిల్లు ఇంటి ప న్ను వంటి మౌలిక వసతులతో బాధితులు నివాసం ఉంటున్నారు. అయితే, ఈ భూము లు లాక్కునేందుకు కొందరు కబ్జారాయుళ్లు బాలానగర్ జోన్ పోలీసు ఉన్నతాధికారుల మద్దతుతో తమ ఇండ్లను జేసిబిలతో కూల్చి వేస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్బంధంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు వా పోతున్నారు.

పి.వెంకటేశ్వర రావు, పి కృష్ణప్రియ, బి.సుబ్బారావు వారి అనుచరులు పి. జీవన్ ప్రకాష్, వెంకట్, వినోద్, జి.ప్రీతి, JCB ఓనర్ గౌస్ పాషా, ఖాజా (రైతుబజార్ ఉ ద్యోగి)   పదేపదే ఇళ్లపై కొచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నారనీ ఆరోపించారు. గత  సో మవారం అర్ధరాత్రి సమయంలో జేసిబిలతో కూల్చివేతలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సివిల్ వ్యవహారాల్లో పోలీసులు

సైబరాబాద్ సీపీకి బాధితులు ఇచ్చిన ఫి ర్యాదు ప్రకారం బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, జగద్గిరిగుట్ట ఎస్‌హెచ్‌వో నరసింహ, ఎస్‌ఐ రాజేష్ భూకబ్జాదారులకు అండగా ని లుస్తూ, రాత్రివేళల్లో  గూండాల సహాయంతో ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నా రు. కోర్టు స్టే ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కబ్జా దారులకు సహకరిస్తున్నారని పోలీసులపై  మండిపడుతున్నారు.

స్థానిక పోలీసు అధికారులు బినామీల పేరుతో రూ.2 కోట్లకు కొంత స్థలాన్ని కొనుగోలు చేశారని భూకబ్జాదారులే చెప్పి, బెదిరి స్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు అమలుచేయకుండా, కబ్జా దారులను బెదరించి ఖాళీ చేపించడం వంటి అం శాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సా రించి సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.