06-05-2025 12:28:40 AM
ఎమ్మెల్సీ కొమురయ్య
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య సోమ వారం ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి నిర్వ హించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, సర్వశిక్షా అభియాన్‌లో ఉన్నత విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉండి.. కాం ట్రాక్ట్ బేసిక్ కింద ఉన్న వారందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల సొమ్ము వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు.
ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఏ హాస్పిటల్‌లోనూ పని చేయడం లేదని... భేషరతుగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రూ.7400 కోట్లకు పైగా ఫీజు బకాయిలు ఉంటే కేవలం రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.