06-05-2025 12:25:28 AM
నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి
కడ్తాల్, మే 05 : రైతులెవరు అధైర్యపడవద్దని చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.
సోమవారం కడ్తాల్ మండల కేంద్రంలోని ముద్విన్, కడ్తాల గ్రామాల్లో వరి కొనుగోలు కౌంటర్లను ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నరసింహ, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ పాలకవర్గంతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కౌంటర్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులకు ప్రతిరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని రైతులెవరు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతన్నలకు మద్దతు ధర ఇచ్చేందుకే సింగల్ విండోల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు.
ధాన్యం తూకం వేసిన అనంతరం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెంకటేష్, సింగల్ విండో డైరెక్టర్లు జోగు వీరయ్య, మార్కెట్ కమిటీ సభ్యులు నరేష్, మాజీ మెంబర్ లాయక్ అలీ, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బిచ్చ నాయక్, ఆమనగల్ సింగల్ విండో సీఈఓ దేవేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.