16-10-2025 12:00:00 AM
చర్చగా మారిన కల్వకుర్తి మున్సిపల్ రాజకీయాలు
కల్వకుర్తి అక్టోబర్ 15 : వెంచర్ల నిర్మాణ సమయంలో ప్రభుత్వానికి అప్పగించే 10 శాతం భూమిపై కల్వకుర్తి పట్టణంలో రాజకీ య రగడ కొనసాగుతుంది. ప్రధాన పార్టీల నాయకులు, ఒకరిపై మరొకరు పరస్పరం ఆ రోపణలు చేసుకుంటూ చర్చకు తెర లేపారు. కల్వకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో నిర్మించిన వెంచర్ల లోని 10 శాతం భూమి కబ్జాల గురైందని నాయకులే కాజేశారంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుం టున్నారు.
హైదరాబాద్ నగరానికి కల్వకుర్తి పట్టణం అతి చేరువలో ఉండడం, పట్టణం మీదుగా మూడు జాతీయ రహదారులు ఉండడంతో భూముల ధరలకు ఎక్కడలేని విధంగా విలువ పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టణ సమీపంలో భూములు కొనుగోలు చేసి వెంచర్ నిర్మించి ప్లాట్లు విక్రయిస్తున్నారు . హైదరాబాద్ తరహాలో ఈ ప్రాంతంలో గజానికి రూ,10 నుండి రూ,50 వేల వరకు పలుకుతుండటంతొ ప్రభుత్వ స్థ లాలపై కొందరు కన్ను పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అధికారంలో ఉన్న నా యకులే స్థలాలను విక్రయించారంటూ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసు కుంటున్నారు. కల్వకుర్తి గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో సుమారు 30కి పైగా వెంచర్ నిర్మించినప్పటికీ అందుకు సంబంధించిన ఫైల్స్ కనుమరుగు కావడంతో 10 శాతం భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి రావాల్సిన భూ మి అధిక మొత్తంలో అన్యాక్రాంతకం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
- 2014 నుంచి....
కల్వకుర్తి గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడ్డాక 2014 నుండి ఇప్పటివరకు సుమారు 50 వెంచర్ లకు పైగా నిర్మించారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం వెంచర్ అనుమతి ఇవ్వాలంటే ఉపయోగకరమైన స్థలాన్ని 10 శాతం ఆయా మున్సిపాలిటీ పేరున రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉండటంతో మున్సిపాలిటీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
దీంతో 2014 నుండి 2025 వరకు నిర్మించిన వెంచర్ల నుండి కల్వకుర్తి మున్సిపాలిటీకి సుమారు 38 ఎకరాల భూమి సమకూరింది. ఇందులో పార్కులు, ఓపెన్ జిమ్ములు నిర్మించారు. కొత్తగా ఏర్పడిన వెంచర్లలో అభివృద్ధి పనులు చేపట్టి ప్ర జలకు అనువుగా మార్చుతున్నారు. దీంతో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా కొంతవరకు మేలు జరుగుతుంది.
పాత వెం చర్లపై అధికారులు దృష్టి సారించి స్థలాలు గుర్తించి రక్షణ చర్యలు చేపడితే విలువైన భూములు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలుకోరుతున్నారు.