calender_icon.png 16 October, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదు

16-10-2025 12:56:57 AM

  1. కాంగ్రెస్ అధిష్ఠానం మాలాంటి సీనియర్ నేతలను గుర్తించాలి

చైర్మన్ పదవి ఇస్తే తప్పక స్వీకరిస్తా

కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధర్‌రెడ్డి

అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నాయకుడు

హైదరాబాద్, అక్టోబర్ 15( విజయక్రాంతి): సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.మురళీధర్‌రెడ్డి తన జన్మదిన వేడుకలను హై దరాబాద్ నాంపల్లి చిరాగ్ గల్లీలోని తన నివాసంలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు తన అభిమాన నేతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం మురళీ ధర్‌రెడ్డిచే కేక్ కట్ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అడుగజాడల్లో నడుస్తూ రాష్ట్రం అప్పులో కూరుకుపోయిన పేద ప్రజలకు, రైతన్నలకు, ఆడపడుచులకు, నిరుద్యోగుల కు, వృద్ధులకు ,విద్యార్థులకు,

వివిధ సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మురళీధర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనలాంటి వారు ఎందరో కాం గ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు ఎందరో ఉన్నారని, వారికి చైర్మన్ పదవులిచ్చి అక్కున చేర్చుకోవాలని కోరారు. కాగా ‘విజయ్‌క్రాంతి‘తో మురళీధర్ రెడ్డి మాటామంతి..

కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే మీరు స్వీకరిస్తారా? 

తప్పకుండా నామీద నమ్మకంతో ఏ పదవి ఇచ్చిన పార్టీకి రుణపడి ఉంటాను. ఏ బాధ్యతలు అప్పగించిన క్రమశిక్షణతో పూర్తి చేస్తాను. నా వ్యక్తిత్వాన్ని గుర్తించి సీఎం రేవంత్‌రెడ్డి  ఏ బాధ్యత ఇచ్చిన అభివృద్ధి బాటలో నడిపిస్తాను. అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూపిస్తా.  ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చేస్తా.

ఏ పదవి కావాలని కోరుకుంటున్నారు?

నేను ఏనాడు పదవుల కోసం ఆశ పడలేదు. సీఎం రేవంత్ రెడ్డి నా సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని భావించి చైర్మన్ పదవి ఇస్తే తప్పకుండా స్వీకరించి దానికి న్యాయం చేస్తా.

సీఎం గారు మీకు పదవి ఇస్తారు అని అనుకుంటున్నారా?

సాధారణ కార్యకర్తలను నాయకులుగా చేసిన నేత సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  నుంచి పనిచేస్తున్నాము. మాలాం టి సీనియర్లకు చైర్మన్ పదవి కట్టబెడితే పార్టీకి కూడా లాభం. పదవికి కూడా మంచిది అని నేను కోరుకుంటున్నాను.