06-12-2025 12:00:00 AM
సర్పంచ్గా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవం
శంకర్ పల్లి, డిసెంబర్ 5: శంకర్ పల్లి మండల పరిధిలోని పర్వేద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన రికార్డు నమోదైంది. గ్రామాభివృద్ధి ధ్యేయంగా, పర్వేద గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, తమ గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల్లో ఎన్కతల సురేందర్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు, రాజకీయాలకు అతీతంగా సురేందర్ గౌడ్ను బలపరిచారు.
గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నూతన సర్పంచ్గా ఎన్నికైన ఎన్కతల సురేందర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అందరి సహకారంతో పర్వేద గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ ఏకగ్రీవ తీర్మానం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.