06-12-2025 12:00:00 AM
సంగారెడ్డి, డిసెంబర్ 5(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రోజుకో సిత్రా లు జరుగుతున్నాయి. ఏళ్ళ తరబడి దూ రంగా ఉంటున్న బంధువులు సైతం ఈ ఎన్నికలు కలుపుతున్నాయి. అంతేగాకుండా తమ బంధువుల గెలుపు కోసం పట్టణాల నుండి పల్లెలకు ప్రచారం నిమిత్తం వస్తున్నారు. బంధువుల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ చేస్తే అందరు కూర్చొని ఒక్కరినే నిలెబడుతున్నా రు.
పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల సమన్వయం, పెద్దల జోక్యం, అన్నదమ్ము లు విడిపోవద్దనే ఆలోచనతో వేసిన నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. అదేవి ధంగా పోటీ చేసేవారిలో గిట్టని వారు ఉంటే.. బరిలోకి దిగి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.
దూరమైన బంధాలు ఒక్కటవుతున్నాయి...
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. అయితే గ్రామా ల్లో గెట్ల పంచా యితీ, కుటుంబ కలహాలతో సుదీర్ఘ కాలంగా విడివిడిగా ఉన్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మామ అల్లుళ్ల మధ్య అంతరాలు తగ్గు తున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులు కుటుంబ సమేతంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి తమకు మద్దతు ప్రకటించాలని బతిమిలాడుతున్నారు. ఇరువర్గాలకు కావల్సిన బంధువు లను మధ్యలో పెట్టి రాయబారాలు పంపుతున్నారు. దీంతో ఇప్పటి వరకు శత్రువుగా ఉన్న వారు మద్దతు అడగడంతో భేషజాలు విడిచిపెట్టి బంధుత్వాలను నెమరు వేసుకుంటున్నారు. ఒకరి గెలుపుకోసం మరొకరు ప్రచారంలోకి దిగుతున్నారు.
ప్రచారం కోసం పల్లెలకు..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గెలుపు మద్దతు తెలిపిన పార్టీలకే కాకుండా, బంధువులకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తమ అన్న, తమ్ముడు, బాబాయ్, మామ, అల్లుడు పోటీలో ఉండి ఓడిపోతే గ్రామంలో పరువు పోతుందని, ఇప్పటి వరకు గ్రామంలో ఉన్న పట్టు పోతుందనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకోసం తమ బంధువులను గెలిపించేందుకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారు కూడా పల్లెబాట పడుతున్నారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తూ గెలిచి తీరాలి.. ఎంత ఖ్చనా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.