calender_icon.png 6 December, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసా కిట్ల పంపిణీ

06-12-2025 06:02:24 PM

మంచిర్యాల (విజయక్రాంతి): నాసా కోసం ప్రాజెక్ట్ సిద్ధం చేసిన మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను డీసీపీ ఎగ్గడి భాస్కర్ అభినందించారు. ప్రాజెక్ట్ సిద్ధం చేయడానికి విద్యార్థులకు ఉపయోగపడే నాసా కిట్లను శనివారం డీసీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అయూబ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ చైతన్య నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నాసా ప్రాజెక్టులకు తమ పేర్లను నమోదు చేసుకుంటారని, ఈ ఏడాది సైతం పోటీ పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, డీన్ శ్యామ్, నాసా ఇంచార్జ్ స్వాతి, ప్రియాంక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.