calender_icon.png 2 May, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయసును తగ్గించుకోండి

23-03-2025 12:00:00 AM

ఉరుకుల పరుగుల జీవితంలో శరీరంపై ఎంతో ఒత్తిడి పడి వృద్ధాప్యం చేరువైపోతుంది. ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

వెయిట్ లిఫ్టింగ్ అనేది దీర్ఘకాలపు రాబడి కోసం మనం పెట్టుబడే పెట్టుబడి లాంటిది. కాబట్టి మెటబాలిజంను పెంచి, విశ్రాంతి దశలో సైతం క్యాలరీల ఖర్చుకు తోడ్పడే వెయిట్ లిఫ్టింగ్ సాధన చేయాలి.

పిండిపదార్థాలు, అదనపు క్యాలరీలతో బరువు పెరుగుతాం. కాబట్టి తేలికపాటి జీర్ణమయ్యే ఆహరం తీసుకోవాలి. 

దాహం వేసినప్పుడే మాత్రమే చాలామంది నీళ్లు తాగుతారు. కాని శరీరానికి సరిపడే నీరు తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

శీతల పానీయాలు, వంటనూనెల వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి చేరిపోతుంటాయి. కాబట్టి వాటిని పరిమితం చేయాలి.

నిద్రలేమి ఆకలిని, స్ట్రెస్ హార్మోన్లను పెంచుతుంది. కాబట్టి 7 గంటలపాటు కచ్చితంగా నిద్రపోండి. 

మానసిక ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామాలు చేయండి.