స్ట్రా వాడకం తగ్గించండి

29-04-2024 12:05:00 AM

ఎండాకాలం రాగానే కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు తాగటం మామూలే. అయితే వీటిని తాగేందుకు వాడే స్ట్రాలతో జాగ్రత్త అవసరం అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ప్లాస్టిక్ స్ట్రా మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఇది కరిగిపోవడానికి చాలా రోజులు పడుతుంది. ఇది మట్టిలో కలిసినప్పుడు విషపూరితంగా మారుతుంది. దీని వల్ల మొక్కలు, వన్యప్రాణులు, చేపలు, మానవులకి మంచిది కాదు. మనం వాడే స్ట్రాలలో చాలా రకాలు ఉంటాయి.  అవి కూడా పర్యావరణానికి హాని కలిగించే ఇతర హానికర రసాయనాలు కలిగి ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది స్ట్రాలని వాడతున్నారు. ఇవి తిరిగి చెత్తగా మారి పర్యావరణంలోకి చేరి చాలా సమస్యలకి కారణంగా మారుతుంది. 

వీటిని రీసైకిల్ చేయడం కష్టం.  కాబట్టి, వీటిని వాడకపోవడమే మంచిది. ఈ ప్లాస్టిక్ స్ట్రాలు పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా చిన్న చిన్న కణాలుగా విడిపోయి పర్యావరణంలో ఎక్కడో ఒకచోట ఉండి పర్యావరణానికి హానిచేస్తాయి. డయాక్సిన్ ఉద్గారాలను విడుదల చేయడం వల్ల వీటిని కాల్చడం కూడా మంచిది కాదు. అలాగని పేపర్ స్ట్రాలని వాడటమూ సరికాదు. ఈ స్ట్రా నానిపోకుండా ఉండేందుకు వాడే ప్లాస్టిక్ కోటింగ్ మన ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. ప్లాస్టిక్ స్ట్రాలని వాడే బదులు స్టెయిన్ లెస్ స్టీల్, మెటల్ స్ట్రాలని వాడడం మంచిది. అయితే వీటిని సరైన విధంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీటివల్ల వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అన్నిటికన్నా అసలు స్ట్రా వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవటం ఈ సమస్యకి సరైన పరిష్కారం.