19-08-2025 01:19:31 AM
పెద్దంపేటలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభలో మంథని ఆర్డీఓ సురేష్
రామగిరి, ఆగస్టు 18 (విజయ క్రాంతి) సింగరేణి ప్రభావిత గ్రామమైన రామగిరి మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ మంథని ఆర్డీవో సురేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకరా 12 గుంటలు ( 1.12 ) భూ మిలో 52 ఇండ్ల సంబంధించి నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాసం, పునఉపాధి కల్పనపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని ఆర్డీవో సురేష్ తెలిపారు.
గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకుని జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తామని, అనంతరం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ చింతపట్ల నాగరాజు మాట్లాడుతూ 52 కుటుంబాల సంబంధించి ఆర్ అండ్ ఆర్ పునరావసం పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలో గల సెంటనరీ కాలనీ వకీల్ పల్లె ఫ్లాట్స్ లోనైనా లేక జేఎన్టీయూ కాలేజీ వద్ద గల భూమిని కేటాయించాలని, లేక కమాన్ పూర్ మండలం పెంచికల పేట గ్రామ వనదేవతలను తరలించిన పక్కన గల భూమిలో కేటాయించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి అయ్యేవరకు గ్రామానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే పథకాలు గాని, వివిధ పథకాలు అందే విధంగా చూడాలని, అలాగే ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుమన్ ఎంపీడీవో భద్రి శైలజ రాణి, ఆర్ ఐ రవిశంకర్, సింగరేణి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.