calender_icon.png 26 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రయోజనాలకే జీఎస్టీలో సంస్కరణలు

26-09-2025 12:00:00 AM

  1. తెలంగాణ సంపదను కేటీఆర్ కుటుంబం దోచుకుంది
  2. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ప్రజా ప్రయోజనాల కోసం జీఎస్ టీలో సంస్కరణలు తీసుకువచ్చి దేశంలోని 90శాతం పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మేలు చేశారని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ లో సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ సుప్రి యా నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుధ్యకార్మికులకు చీరలు పంపిణీ చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... జీఎస్టి టీ తగ్గించడం వల్ల నిత్యవస సరుకుల ధరలు తగ్గడం వల్ల రోజు వారిగా కొనుగోలు చేసేవారికి, పేద ప్రజలకు పన్నుల భారం తగ్గిందని పేర్కొన్నారు. 10సం వత్సరాలలో దేశ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగు పరిచారని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి పెరగడంతో పాటు కొత్తగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తెలంగాణ సంపదను కేటీఆర్, వారి కుటుంబం దోచుకుందని విమర్శించారు. అందువల్లే వారిని ఇంటికే పరిమితం చేశారని పేర్కొన్నారు. అయినప్పటికి బీఆర్‌ఎస్ కు బుద్దిరావడం లేదని ప్రధాని నరేంద్రమోదీపై జీఎస్‌టీ విషయంలో అవాక్కులు, చెవాక్కులు పలుకు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్‌ను కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, కన్వీనర్ రమేష్ రాం, పార్టీ సీనియర్ నాయకులు బిజ్జి రవి, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

వైద్య శిబిరాలను 

 కంటి వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఓబీసీ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. ఈ మేరకు గాంధీనగర్ డివిజన్ లోని వివి గిరినగర్ కమ్యూనిటీ హాల్ లో డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎం.పి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, ఉమేష్, ఆనంద్ రావు,సాయి కుమార్, సాయి యాదవ్, విజయ లక్ష్మి, సంధ్యా రాణి మరియు వైద్యు లు డాక్టర్ శ్రీ రామ్, వైద్య సహాయకులు అవినాష్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.