26-09-2025 12:00:00 AM
ముషీరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మెట్రో పాలిటన్ పట్టణ ప్రణాళిక లో పునరావృతమయ్యే సవాళ్లను పరిష్కరించడానికి హెచ్.ఎం.డి.ఎ ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ (ఎఫ్.బీ.హెచ్) చైర్మన్ వేదకుమార్ మణికొండ కోరారు. నగరానికి సమగ్ర డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ యొక్క అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఈ మేరకు గురువారం సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్(సీడీఎస్), అనేక పౌర సమాజ సంస్థల సహకా రంతో ఎఫ్‌బీహెచ్, అఫ్జల్గంజ్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని చారిత్రాత్మక చింతపండు చెట్టు కింద వార్షిక స్మారక, సంఘీభావ సమావేశాన్ని ఎఫ్.బీ.హెచ్ చైర్మన్ వేదకుమార్ మణికొండ ఈ సమావేశానికి అధ్యక్షతన నిర్వహించారు. పండిట్ పరాశర్ మూసీ వరదలకు అంకితమైన ఆత్మీయ లావణిని అందించడంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఎఫ్‌బీ హెచ్ వైస్ చైర్మన్ ఎంహెచ్ రావు సభకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వేదకుమార్ మాట్లా డుతూ 1908 సెప్టెంబర్లో వినాశకరమైన ముసి నది వరదల సమయంలో దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడిన ఈ చెట్టు, మానవాళికి దాని శాశ్వత సేవకు జ్ఞాపకంగా నిలిచిందని అన్నారు. 2008లో ప్రారంభమైన స్మారక సమావేశాన్ని, అప్ప టి నుండి దాని నిరంతర ఆచా రాన్ని గుర్తు చేసుకున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా మూసీ నదిని అధ్యయనం చేయ డంలో ఎఫ్‌బీహెచ్ చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నారు. ఈఎస్‌ఐసి డైరెక్టర్ డా.జి. రామేశ్వర్‌రావు, బి.నారాయణ, రిటైర్డ్ డిప్యూ టీ డైరెక్టర్, హెరిటేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ నర్సారెడ్డి(ట్రస్మా), ఆకుల రవీందర్, శంకర్(జై భీమ్), రాంరాజ్, ఇలియాస్, శ్రీహరి సయ్యద్ ఖలీద్, శ్రీలత, సయ్యద్ ఖైజర్ భాషాతో పాటు ఛత్రి, ఎంఎస్‌ఐ, ఏపీఎస్‌ఏ నుండి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.