calender_icon.png 22 November, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాప విముక్తి

26-07-2024 02:30:00 AM

నిత్యమాత్మరత స్తుర్యం 

జపత్యధ్యాయ మాదరాత్ 

తదభ్యాసా దదుష్టాత్మా న 

ద్వంద్వైరభి భూయతే ॥

పూర్వం గోదావరి తీరంలో ‘చిన్న పాపం’ అనే తీర్థస్థలంలో సత్యతవుడు అనే యోగి పుంగవుడు ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. అతని తపస్సువల్ల తన పదవికి ఎక్కడ భంగం కలుగుతుందో అని ఇంద్రుడు భయపడతాడు. అతని తపస్సుకు భంగం కలిగించమని ఆదేశించి ఇద్దరు అప్సరసలను పంపుతాడు. వారు సుమధుర ఆటపాటలతో నాట్యాలు చేసి సత్యతవుని తపస్సును చెడగొడతారు. దాంతో కోపోద్రిక్తుడైన అతను గంగాతీరంలో రెండు రేగుచెట్లుగా జన్మించమని వారిని శపిస్తాడు. ఆ అప్సరసలు కరుణించమని వేడుకొన్న తర్వాత, “భరతుడు అనే మహాత్ముడు వచ్చేంత వరకు మీరు అలా వృక్షరూపాలలోనే ఉంటారు. అనంతరం పూర్వజన్మ స్మృతి గలవారై మానవ జన్మ ఎత్తి క్రమంగా దేవతా రూపాలను పొందుతారు” అంటాడు.

ఆ అప్సరసలు బదరీ వృక్షాలుగా మారిపోయారు. కొన్నేళ్లకు భరతుడు అనే వ్యక్తి రేగుచెట్ల నీడలో భగవద్గీత నాలుగవ అధ్యాయాన్ని పారాయణం చేస్తాడు. దానిని విన్న అప్సరసలు శాప విముక్తులై మానవులుగా జన్మిస్తారు. వారు గీత మహిమను కొనియాడుతూ కొన్నాళ్ల తర్వాత మానవ జన్మనూ వీడి, దేవతల రూపాలను పొందారు. ఈ చతుర్థాధ్యాయ పారాయణం వల్ల మనుషులే కాదు, వృక్షాదులు కూడా దోష విముక్తులై తరిస్తాయన్నమాట.