23-05-2025 01:13:41 AM
రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ్మరెడ్డి
కడ్తాల్, మే 22 : తెలంగాణ వ్యాప్తంగా మాజీ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లుల విడుదలలో స్పష్టత లేకపోవడంపై రాష్ట్ర స ర్పంచుల సంఘం తీవ్రంగా మండిపడింది. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో రా ష్ట సర్పంచుల సంఘము అధ్యక్షుడు గూ డూరు లక్ష్మినర్సింహా రెడ్డి మాట్లాడారు. రా ష్ట్రవ్యాప్తంగా మొత్తం 12769 గ్రామపంచాయతీలకు గాను 153 కోట్లు మాత్రమే వి డుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు.
రా ష్ట్రవ్యాప్తంగా సుమారు 1200 కోట్ల రూపాయల బకాయిలకు సర్పంచులవి ఎంత శాతం పెండింగ్ బకాయిలు విడుదల చేశార ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లుల విడుదలపై స్పష్టత కరువైందని, పెండింగ్ బిల్లులు ఎంత శాతం విడుదల చేశారో ప్రభుత్వం వివరించాలని కోరారు.గ్రామపంచాయతీ వారిగా బ కాయిలు ఎన్ని, విడుదల చేసిన బిల్లులు ఎన్ని ,ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉ న్నాయనే వివరాలపై ప్రభుత్వం వెంటనే స్ప ష్టత ఇవ్వాలని కోరారు.
గ్రామపంచాయతీలలో పాలకవర్గం లేక అవస్థలు పడుతున్న త రుణంలో పంచాయతీ కార్యదర్శులు గ్రా మపంచాయతీలను నడిపిస్తున్నారని,పంచాయతీ కార్యదర్శులు వారి జీతాలను మొత్తం మరియు అప్పులు తెచ్చి గ్రామపంచాయతీలకు వెచ్చిస్తున్నారని అన్నారు.పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నా యో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్రామాల వారీగా ఎస్ డి ఎఫ్, సిడి ఎఫ్, ఎస్ ఎఫ్ సిల ద్వారా చేపట్టిన పనులకు ఎన్ని బి ల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పటికి ఎం త విడుదల చేశారు, మిగిలినవి ఎన్ని అనే అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రజా పాలన అని చెప్తున్న ప్రభుత్వం అందాల పోటీలకు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ , గ్రామా ల్ని ఆదర్శముగా తీర్చిదిద్దిన తెలంగాణ స ర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా సర్పంచుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంద రో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా, రాష్ట్ర సర్పంచుల సంఘం ఏడాదిన్నరగా ఎ న్నో పర్యాయాలు పోరాటాలు చేసినా ప్రభు త్వం పెండింగు బిల్లులు ఇవ్వకుండా ఏళ్ళకి ఏళ్ళు సతాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధ్వజమెత్తారు.సర్పంచుల, పంచాయతీ కార్యదర్శుల బిల్లులు వెంటనే విడుదల చే యాలని లేని పక్షంలో స్థానిక సంస్థల నిర్వహణను అడ్డుకుంటామని హెచ్చరించారు.